సమ్మెతో నిలిచిపోయిన లారీలు

3 Oct, 2015 18:37 IST|Sakshi

ఆటోనగర్ (హైదరాబాద్): టోల్‌గేట్‌ల విధానాన్ని రద్ధుచేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్(ఏఎంటీసీ) ఇచ్చిన పిలుపు మేరకు నిరవధిక సమ్మె కొనసాగుతోంది. గత మూడు రోజులుగా ఆటోనగర్‌లోని పారిశ్రామిక వాడకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సరుకు రవాణాలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రతి రోజు నగరానికి 600నుంచి 700 వరకు సరకు రవాణా లారీలు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. సమ్మె కారణంగా సదరు వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
 

మరిన్ని వార్తలు