'ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తిస్తాం'

4 Dec, 2015 11:15 IST|Sakshi

కడప : రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆలయాలకు చెందిన 20 వేల ఎకరాల ఆలయ భూములు కబ్జాకు గురైనవని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పి. మాణిక్యాలరావు తెలిపారు. సదరు భూములును కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దూటూరు శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాణిక్యాలరావు విలేకర్లతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ఆలయాలను గుర్తించి... అక్కడివారికి శిక్షణ ఇచ్చి పూజారిగా నియమిస్తామని పి.మాణిక్యాలరావు వెల్లడించారు.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు