'చెరువు పూడికతో కోట్లు దండుకుంటున్నారు'

24 Sep, 2015 12:48 IST|Sakshi

హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్ నేతలు గురువారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీలో జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికలపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అదే విధంగా రాష్ట్రంలోని పలు సమస్యలపై నరసింహన్ దృష్టికి తీసుకెళ్లినట్టు నేతలు తెలిపారు. గవర్నర్ తో భేటీ అనంతరం ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఎదుర్కోలేకే చంద్రబాబు నీటి సంఘాలకు ఎన్నికలు జరపడం లేదని విమర్శించారు.

ఏకాభిప్రాయం లేకుండా టీడీపీ నేతలను చైర్మన్లుగా ఎంపిక చేయడం సరికాదన్నారు. నీటి సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే 90 శాతం టీడీపీకి ఓటమే మిగులుతుందని ఆయన విమర్శించారు. చెరువుల పూడికతీతను ఉపాధి కూలీలకు కాకుండా కాంట్రాక్టర్లకు ఇవ్వడం ద్వారా రైతులకు , కూలీలకు చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. చెరువు పూడికను రియల్ ఎస్టేట్ కు తరలిస్తూ టీడీపీ నేతలు కోట్లు దండుకుంటున్నారన్నారు. వాటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తలు