చాటింగ్‌.. నయా చీటింగ్‌!

12 Oct, 2017 09:47 IST|Sakshi

మార్ఫింగ్‌ ఫొటోలతో బెదిరింపులు

వారం రోజుల్లో బాధితులుగా మారిన ఏడుగురు

బుధవారం సైబర్‌ కాప్స్‌ను ఆశ్రయించిన యువతి

కేసు నమోదు, దర్యాప్తు ప్రారంభం

సాక్షి, సిటీబ్యూరో: యువతులు, మహిళలతో చాటింగ్‌ ముసుగులో కొత్త తరహా మోసాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నాళ్ళు స్నేహం నటించిన సైబర్‌ నేరగాళ్ళు ఆపై మార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరి బారినపడిన బాధితురాళ్లలో కొందరు భయపడి తమ నగ్న చిత్రాలను వారికి పంపిస్తున్నారు. ఆపై ఆ నేరగాళ్ల వేధింపులకు తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. గత పది రోజుల్లోనే దాదాపు ఏడుగురు సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా బుధవారం ఓ యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. బాధితుల్లో కొందరు బ్లాక్‌ మెయిలింగ్‌ను ముందే గుర్తించి పోలీసులను ఆశ్రయించగా... మరికొందరు మాత్రం నేరగాళ్ళు చెప్పినట్లు చేసిన తర్వాత ఫిర్యాదు చేశారు. సిటీకి చెందిన ఓ వివాహితకు ‘అస్క్‌’ అనే చాటింగ్‌ సైట్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతగాడు కొన్నాళ్ళ పాటు ఆమెతో స్నేహపూర్వకంగానే చాటింగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆమెకు చెందిన ఫేస్‌బుక్‌ ఖాతా వివరాలు తెలుసుకున్నాడు. అందులో ఉన్న ఆమె ఫొటోలు, వివరాలు సంగ్రహించాడు. ఫేస్‌బుక్‌లో ఉన్న ఫొటోల నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఆ ఫొటోను మార్ఫింగ్‌ చేసి అశ్లీల ఫొటోతో జత చేశాడు.

ఆపై చాటింగ్‌లో ‘నీకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు నా వద్ద ఇంకా ఉన్నా యి. నాతో అశ్లీలంగా చాటింగ్‌ చేయకపోతే వాటిని బహిర్గ తం చేస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. తొలుత బాధితురాలు పట్టించుకోకపోవడంతో అతను మార్ఫింగ్‌ ఫొటోలను ఆమెకు పంపడంతో కంగుతిన్నారు. తన మాట వినకపోతే వీటిని నీ భర్తకు పంపడంతో పాటు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తానంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగాడు. బాధితురాలు పూర్తిగా భయపడిందని నిర్థారించుకున్న తర్వాత ‘నగ్న సెల్ఫీ’లు కావాలంటూ బెదిరించాడు. తనకు ఫోటోలు చాట్‌ రూమ్‌ ద్వారా పంపించడం రాదంటూ ఆమె ప్రాధేయపడినా అతగాడు వినిపించుకోలేదు. ఫేస్‌బుక్‌ ద్వారా పంపమంటూ తీవ్ర ఒత్తిడి చేస్తూ... ఓ ఐడీ క్రియేట్‌ చేసి ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ సైతం పంపాడు. ఫేస్‌బుక్‌ ద్వారానే తనతో అశ్లీల చాట్‌ చేయాలని బెదిరించాడు. గత్యంతరం లేక బాధితురాలు సెల్ఫీలను పంపినీ సైబర్‌ నేరగాడి నుంచి వేధింపులు ఆగకపోవడంతో బుధవారం సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ నేరగాడు ముందు పంపిన ఫొటోను పరిశీలిస్తే అది మార్ఫింగ్‌ అని తెలిసిందని, ఈ విషయాలు తన భర్తకు తెలిస్తే ఇబ్బందుల పాలు అవుతానౌ ంటూ కన్నీరుమున్నీరైంది. ఇలాంటి గుర్తుతెలియని వ్యక్తులతో చాటింగ్స్‌ చేయవద్దని, ఎవరైనా బెదిరింపులకు దిగితే వెంటనే తమకు ఆశ్రయించాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు.

మరిన్ని వార్తలు