పాతబస్తీలో 105 మందిపై రౌడీషీట్లు

6 Apr, 2016 19:32 IST|Sakshi
పాతబస్తీలో 105 మందిపై రౌడీషీట్లు

హైదరాబాద్: పాతబస్తీలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ నేరాలకు పాల్పడుతున్న 131 మందిపై దక్షిణ మండలం పోలీసులు షీట్లు ఓపెన్ చేశారు. ఇందులో 105 మందిపై రౌడీషీట్లు, 25 మందిపై సస్పెక్ట్ షీట్లు, ఒక్కరిపై సీడీసీ(సిటీ డోసర్ క్రిమినల్)లను తెరిచారు. దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...  పాతబస్తీలో ఏడాది కాలంగా కార్డన్ సెర్చ్‌లు, కమ్యూనిటీ పోలీసింగ్, పీడీ యాక్ట్‌లను ప్రయోగిస్తుండడంతో వ్యవస్థీకృత నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు.

ఇప్పటి వరకు 47 మందిపై పి.డి.యాక్ట్ నమోదు చేశామని, మరో 20 మందిపై నమోదు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం అయినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలోనే గతంలో ఉన్న రౌడీషీటర్లలో వయోవృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, సత్ప్రవర్తన కారణంగా 200 మందిపై రౌడీషీట్లను తొలగించినట్లు తెలిపారు. కాని, ఇటీవలి కాలంలో పాతబస్తీలో కొందరు యువకులు ఎక్కువగా నేరాలకు పాల్పడుతుండటంతో వారిని కట్టడి చేసేందుకు కొత్తగా రౌడీషీట్లను తెరుస్తున్నామన్నారు. ప్రస్తుతం రౌడీషీట్లు నమోదైన వారి కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సత్యనారాయణ చెప్పారు. 

>
మరిన్ని వార్తలు