బీజేపీ పాలనలో 156 మత ఘర్షణలు

14 Oct, 2015 18:10 IST|Sakshi

కేంద్రంలో భారతీయ జనతా పార్ట్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 156 మత ఘర్షణలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు ఆరోపించారు. ఇప్పటి వరకూ ఒక్క మతఘర్షణ నమోదు కాని.. దాద్రిలో ఘోర ఘటన చోటుచేసుకుందని ఆయన అన్నారు.

బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు వ్యతిరేకంగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 'భారత రాజకీయాలు, బీఫ్ తినడం పట్ల అభ్యంతరాలు' పేరిట  రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు.. ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని అన్నారు.

ప్రజలు ఏం తినాలో.. ఎలాంటి బట్టలు కట్టుకోవాలో.. ఏ పుస్తకం చదవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తే ఎలాగని ప్రశ్నించారు. మనది ప్రజాస్వామ్య దేశం అనే సంగతి పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు.
 

మరిన్ని వార్తలు