పోలీస్ శాఖలో 2,904 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

12 Nov, 2015 16:34 IST|Sakshi
పోలీస్ శాఖలో 2,904 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. తెలంగాణ పోలీస్ శాఖలో 2,904 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అనుమతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా  పోలీసు ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒకేసారి 9,096 పోలీసు ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడంతోపాటు భారీ సంస్కరణలకు ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా తొలిదశలో దాదాపు మూడు వేల పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయనుంది.

కాగా మహిళలకు సివిల్ విభాగంలో 33 శాతం(మూడో వంతు), ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. అత్యంత కఠినంగా ఉన్న దేహదారుఢ్య పరీక్షలు సైతం ఇకపై సరళీకృతం కానున్నాయి. ఈ నూతన విధానాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్‌పీఎస్‌సీ) ఆమోదించాల్సి ఉంది. పోలీసు శాఖలో 8,401 పోస్టులు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సులో 186, అగ్నిమాపక దళంలో 510 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇవాళ 2,904 పోస్టులకు లైన్ క్లియర్ అయింది.

మరిన్ని వార్తలు