బ్లాస్టింగ్‌లో ఇద్దరికి గాయాలు

14 Jul, 2016 11:03 IST|Sakshi
హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంటిని నిర్మించేందుకు రాళ్లను బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
మరిన్ని వార్తలు