పౌర సరఫరాలకు 2 స్కోచ్‌ అవార్డులు

7 Sep, 2017 02:42 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు జాతీయ స్థాయిలో రెండు స్కోచ్‌ అవార్డులు దక్కాయి. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా కట్టడి లక్ష్యంగా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణ, ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎంఎస్‌–ఓపీఎంఎస్‌ (ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌–ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)లు జాతీయ స్కోచ్‌ అవార్డులకు ఎంపికయ్యాయి.

ఈ శాఖకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 1,337 స్టేజ్‌ 1, స్టేజ్‌ 2 వాహనాలు, 46 కిరోసిన్‌ ట్యాంకర్లకు జీపీ ఎస్‌ అమర్చడం, హైదరాబాద్‌లోని మండల స్థాయి నిల్వ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను అమర్చి వీటన్నిటినీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానం చేసింది. దీని ద్వారా రేషన్‌ బి య్యం తరలించే రవాణా వాహనాల కదలి కలను ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాటు చేసింది. గోవా, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రల మం త్రులు, కేంద్ర ఆహార సంయుక్త కార్యదర్శి, జార్ఖండ్‌ పౌర సరఫరాల శాఖ కార్యదర్శి  ఈ సెంటర్‌ పనితీరును ప్రశంసించారు. సంస్థలో రోజూ జరిగే లావాదేవీలపై నిఘా ఉం చడానికి వీలుగా దీనిని రూపొందించింది.  
 
అవార్డులు రావడం సంతోషకరం
‘రెండు జాతీయ స్కోచ్‌ అవార్డులు రావడం సంతోషంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పౌర సరఫరాల శాఖలో చాలా వరకు అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయగలిగాం.’అని కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.   
మరిన్ని వార్తలు