3 లక్షల మందికి నోటీసులు

27 Jul, 2016 21:54 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నీటి మీటర్లు లేని 3లక్షల మంది నల్లా వినియోగదారులకు 60 రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ నోటీసులు జారీ చేయాలని మీటర్‌ రీడింగ్‌ సిబ్బందిని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన మీటర్‌ రీడింగ్‌ విభాగం సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 

నీటి బిల్లులు జారీ చేసే ఈ–పాస్‌ యంత్రాల ద్వారానే ఈ నోటీసులు ముద్రించి స్వయంగా అందజేయడంతోపాటు మీటర్‌ ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించాలని, వాటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలో అవగాహన కల్పించాలని సూచించారు. నోటీసులకు స్పందించి మీటర్లు ఏర్పాటు చేసుకోని వినియోగదారులకు రెట్టింపు నీటి బిల్లులు వసూలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ దిగిరాకుంటే నల్లా కనెక్షన్లు తొలగిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో ఈడీ సత్యనారాయణ, రెవెన్యూ విభాగం డైరెక్టర్‌ డి.శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు