విదేశాల్లో విద్యాభ్యాసానికి 300 మంది

21 Apr, 2016 04:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 300 మంది ఎస్సీ విద్యార్థులను పంపించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఇప్పటివరకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తుండగా, దాన్ని ప్రభుత్వం రూ.20 లక్షలకు పెంచనుంది. గతేడాది 160 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించేందుకు వెళ్లారు. ఈ ఏడాది కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, వేసవిలోనూ హాస్టళ్లను ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం సచివాలయం నుంచి ఎస్సీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా పథకాల అమలు తీరును సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు, ఏజెన్సీలతో మాట్లాడి హాస్టళ్లకు కావాల్సిన మౌలిక మరమ్మతులను క్షేత్రాధికారులు చేయించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్‌‌సలో ఎస్సీ శాఖ అధికారులు ఉమాదేవి, సురేశ్‌రెడ్డి, వసంతలక్ష్మి, ఆనంద్‌కుమార్, జిల్లా ఈడీలు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు