మరో నాలుగు రోజులు వర్షాలు

29 Jun, 2016 03:48 IST|Sakshi

కొనసాగుతున్న అల్పపీడనం
కోయిదాలో 12 సెంటీమీటర్ల భారీ వర్షం

 
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్, ఒడిశా, విదర్భలపై అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. ఉపరితల ద్రోణి ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతోంది. దీంతో వచ్చే 2 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.

తర్వాతి 2 రోజులు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా కోయిదాలో 12 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

>
మరిన్ని వార్తలు