ఆస్పత్రులకు 52 వేల కలర్‌ బెడ్‌షీట్లు

9 May, 2017 02:37 IST|Sakshi
ఆస్పత్రులకు 52 వేల కలర్‌ బెడ్‌షీట్లు

ఇక రోజు విడిచి రోజు నిర్ణీత రంగు వేసేలా ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని ప్రభు త్వ ఆస్పత్రుల పడకలపై రెండు రంగుల బెడ్‌షీట్లు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బెడ్‌షీట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యే లు ఆయా ఆసుపత్రుల్లో ప్రారంభించారు. సిద్దిపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 20 వేల పడకలకు లక్ష బెడ్‌షీట్లు పంపిణీ చేయా లని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం 10,737 పడకలకు 51,998 రంగు రంగుల బెడ్‌షీట్లు అందుబాటులోకి వచ్చా యి. మిగిలిన ఆస్పత్రులకు త్వరలోనే పంపిణీ చేయనున్నారు. అందులో 19,974 గులాబీ, 19,974 తెల్ల బెడ్‌షీట్లు ఉన్నాయి.

అలాగే 6,025 లేత నీలం, 6,025 ముదురు నీలం బెడ్‌షీట్లను డెలివరీ రూమ్‌లు, ఆపరే షన్‌ థియేటర్లలో పరచడానికి సిద్ధం చేశారు. ఇకపై అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల పడకలపై ప్రతి సోమవారం గులాబీ బెడ్‌షీట్లు, మంగళ వారం తెల్ల బెడ్‌షీట్లు వేస్తారు. రోజు విడిచి రోజు ఈ  బెడ్‌షీట్లను మారుస్తూ ఉంటారు. ఇప్పటివరకు పడకలు పాడైపోయినా, వాటిపై వేసే బెడ్‌షీట్లు మార్చకపోయినా అడిగే నాథుడే ఉండేవాడు కాదు.

ఇకపై ఆకస్మిక తనిఖీలు...
బెడ్‌ షీట్లతో పాటు అనేక ఆస్పత్రులనూ ఆధునీకరించి, ఆధునిక వైద్య పరికరాలను అమర్చారు. కొత్త ఫర్నిచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్క ప్రకారం నేడు (మంగళవారం) తెల్ల బెడ్‌షీట్‌ వేయాలి. దీనిపై ఎక్కడికక్కడ నిఘా పెట్టా లని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇంతటి మన్నికైన బెడ్‌ షీట్లు లేవని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఆర్థికశాఖ 1099 పోస్టులు మంజూరు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు