'తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది'

26 Jan, 2016 12:24 IST|Sakshi

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ ప్రజల కల సాకారమైందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అవినీతిరహిత పాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని నరసింహన్ స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి.

ఈ సందర్భంగా జాతీయ జెండాను నరసింహన్ ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. అనంతరం నరసింహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్స్లోని అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా