చట్టసభల్లో మండలిది కీలక భూమిక

20 Dec, 2016 03:38 IST|Sakshi

- తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య
- ‘శాసనమండలిలో షబ్బీర్‌ అలీ ప్రసంగాలు’ పుస్తకావిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌: మేధావులు, అనుభవజ్ఞులు, నిపుణులు ప్రాతినిధ్యం వహించే శాసనమండలిది చట్టసభల్లో కీలకభూమిక అని తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య అన్నారు. శాసనమం డలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌ అలీ ప్రసంగాలతో రూపొందించిన పుస్తకాన్ని హైదరాబాద్‌లో సోమవారం ఆవిష్కరించారు. శాసనమండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్, కేంద్ర మాజీమంత్రి ఎస్‌.జైపాల్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి హరీశ్‌ రావు, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్‌ కె.రోశయ్య మాట్లాడుతూ శాసనమండలితో తనకున్న 22 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.



షబ్బీర్‌ పుస్తకావిష్కరణ సందర్భంగా మండలికి రావడం తో పాతగుర్తులు మదిలోకి వస్తున్నాయన్నారు. షబ్బీర్‌ అలీ ప్రసంగాల పుస్తకం భావితరాలకు ఉపయోగపడుతుందన్నారు. కె.స్వామిగౌడ్‌ మాట్లాడుతూ ఈ పుస్తకం భావితరాలకు స్ఫూర్తి గా ఉంటుందన్నారు. జానారెడ్డి మాట్లాడుతూ ప్రతీ అంశంపై సమగ్ర అధ్యయనం తర్వాత చేసిన ప్రసంగాలు ఒక పుస్తకరూపంలో రావడం అభినందనీయమన్నారు. జైపాల్‌ మాట్లాడుతూ నేతల ప్రసంగాల్లో వ్యంగ్యం ఉండాలని, అవేవీ ప్రత్యర్థిని వ్యక్తిగతంగా బాధపెట్టే విధంగా ఉండకూడదని అన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజాస్వా మ్యంలో ప్రతిపక్ష నేతల పాత్ర గొప్పదన్నారు. షబ్బీర్‌ మాట్లాడుతూ చట్టసభల గౌరవాన్ని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్యులపై ఉంద న్నారు. శాసనమండలిలో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు.

మరిన్ని వార్తలు