లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి

26 Apr, 2016 17:20 IST|Sakshi

మామూళ్లు తీసుకుంటున్న వాణిజ్య పన్నుల శాఖాధికారిని అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. సరూర్‌నగర్ సర్కిల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వేణుగోపాలరావు ఓ వ్యక్తి నుంచి రెండువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీకి పట్టుబడ్డ వేణుగోపాలరావు కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.

 

మరిన్ని వార్తలు