ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ

10 Aug, 2016 09:17 IST|Sakshi

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట విద్యుత్ శాఖ ఏఈ నంగు వేణుగోపాల్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం చిక్కాడు. మోమిన్‌పేట మండలానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని పూర్తి చేయటానికి రూ.25 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు.

దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అధికారుల సూచనల మేరకు రైతు నగదును ఏఈకి తార్నాకలో అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

మరిన్ని వార్తలు