‘షాదీ ముబారక్’పై ఏసీబీ ఆరా..

12 Mar, 2016 19:18 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ పథకం అమలు తీరుపై ఏసీబీ అధికారులు శనివారం దృష్టి సారించారు. పథకం అమల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయంటూ అందిన ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది.

నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో ఈ పథకం కింద సాయం అందుకున్న లబ్ధిదారుల వివరాల రికార్డులను పరిశీలిస్తోంది. గతంలో పెళ్లయిన వారు కూడా తాజాగా వివాహం చేసుకున్నట్లు చూపించి లబ్ధి పొందారని పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. పేదింటి ముస్లిం మైనారిటీ యువతికి వివాహం సందర్భంగా రూ.51 వేలు అందజేయటానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఎస్టీ, ఎస్సీలకు కల్యాణలక్ష్మీ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో బీసీలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

మరిన్ని వార్తలు