'కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం'

24 Jan, 2017 03:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అక్రెడిటేషన్, హెల్త్‌కార్డులు ఇస్తారని అనుకున్న జర్నలిస్టులకు... అధికారుల తాత్సారం అయోమయాన్ని స్పష్టించిందని తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (టీయూడబ్ల్యూ జే) మండిపడింది. అక్రిడిటేషన్‌ కమిటీలో ఉత్సవ విగ్రహాలుగా ఉండలేమని కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. ఇకపై జరిగే సమావేశాలకు కూడా తమ యూనియన్‌ ప్రతినిధులు హాజరుకారని ప్రధాన కార్య దర్శి క్రాంతి కిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కట్ట కవిత సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.

డిగ్రీ ఉంటేనే అక్రెడిటేషన్‌ కార్డులు ఇస్తామనడం మంచి దికాదన్నారు. అదేవిధంగా ఉమ్మ డి రాష్ట్రంలో ఏసీ బస్‌ సౌకర్యం ఉండేదని, ఇప్పుడు అది కూడా ఇవ్వని పరిస్థితి ఏర్ప డిందన్నారు. తెలం గాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం పట్ల అధికారుల వివక్ష కొనసాగుతున్నట్లు కనిపిస్తోందన్నా రు. అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండా హెల్త్‌ కార్డులు ఇవ్వాలని జీవోలో ఉన్నా.... అది వారికి టిష్యూ పేపర్‌లా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు