ఆదర్శనీయుడు అబ్దుల్‌ కలాం

14 Oct, 2016 22:01 IST|Sakshi

గన్ ఫౌండ్రీ:  నేటితరం విద్యార్థులు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాంను రోల్‌ మోడల్‌గా తీసుకోవాలని రామకృష్ణమఠం వివేకానంద ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్ ఎక్స్‌లెన్స డైరెక్టర్‌ పూజ్యశ్రీ స్వామి బోదమయానంద అన్నారు. శుక్రవారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్లో హైదరాబాద్‌ కేంద్ర భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో డాక్టర్‌ అబ్దుల్‌ కలాంపై స్మారకోపన్యాస సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీ బోదమయానంద మాట్లాడుతూ... విద్యార్థులు పట్టుదల, కృషి వ్యక్తిత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. యువత రాణించడంతోనే భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు. భవన్స సైనిక్‌ పురి కేంద్ర సభ్యులు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎం.గోపాలకృష్ణ, హైదరాబాద్‌ కేంద్ర చైర్మన్, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్‌ కృష్ణారావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్‌శాఖ ప్రొఫెసర్‌ సుమితారాయ్, సీనియర్‌ న్యాయవాది ఎల్‌. రవిచందర్‌లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు