రైళ్లలో అదనపు బెర్త్‌లు

13 Aug, 2013 11:35 IST|Sakshi
రైళ్లలో అదనపు బెర్త్‌లు

సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ఎన్జీవోల నిరవధిక సమ్మె ప్రభావం రాకపోకలపై చూపనుంది. రాజధాని హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు రాకపోకలు సాగించే 1500కు పైగా బస్సులు మంగళవారం నుంచి నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 13 నుంచి 20 వరకు 16 రైళ్లలో అదనపు బెర్త్ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా అదనపు ప్రయాణ సదుపాయం ఏర్పడుతుందని సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.
     
 సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే పద్మావతి (12764/12763) ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 15,16,17,18,19 తేదీల్లో  ఒక స్లీపర్ క్లాస్, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు ఈనెల 13,16,17,18,19,20 తేదీల్లో ఒక స్లీపర్ క్లాస్ బోగీ అదనంగా అందుబాటులోకి రానుంది.
     
 సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12731/12732) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 13,14 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 14,15 తేదీల్లో అదనపు స్లీపర్‌కోచ్‌లు ఉంటాయి.
     
 కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (17603/17604) మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 12,19, 13,120 తేదీల్లో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారు.
     
 తిరుపతి-మచిలీపట్నం-తిరుపతి (17401/17402) మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి మచిలీపట్నంకు ఈనెల 19న, తిరుగు ప్రయాణంలో 13,20 తేదీల్లో అదనపు స్లీపర్ క్లాస్ అందుబాటులోకి  రానుంది.
     
 హైదరాబాద్-నర్సాపూర్-హైదరాబాద్ (17256/17255) ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 13,19 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 14,20 తేదీల్లో అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తారు.
     
 హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ (17429/17430) రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 19న, తిరుగు ప్రయాణంలో ఈ నెల 13,20 తేదీల్లో అదనపు బోగీలు ఉంటాయి.
     
 సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12770/12769) సెవెన్‌హిల్స్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు 13,17 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ నెల 16,18 తేదీల్లో అదనపు బెర్తులు ఉంటాయి.
     
 తిరుపతి-కరీంనగర్-తిరుపతి (12761/12762) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి కరీంనగర్‌కు ఈ నెల 16,18 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 15వ తేదీన ఒక స్లీపర్ క్లాస్ చొప్పున  అందుబాటులోకి రానున్నాయి.
 
 రాకపోకలెలా?
 ఎన్జీఓల సమ్మె ప్రకటనతో చాలామంది ముందస్తుగా ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మంగళవారం నుంచి బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభిస్తాయని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఉభయగోదావరి ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే వేల మంది ఇబ్బందులకు గురికానున్నారు. రోజూ 3500 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తాయి. లక్ష మందికి పైగా హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. అయితే, కొద్ది రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్‌లు, ఆందోళనల నేపథ్యంలో రాజధాని నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు