మళ్లీ వికటించిన చికిత్సలు

6 May, 2017 03:08 IST|Sakshi
మళ్లీ వికటించిన చికిత్సలు

సాక్షి, హైదరాబాద్‌: నలుగురు బాలింతలు బలైనా ప్రభుత్వ ఆసుపత్రులకు పట్టిన నిర్లక్ష్యం జబ్బు వదలడం లేదు. వరుస మరణాలు సంభవిస్తున్నా మార్పు కనిపించడంలేదు. తాజాగా సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మళ్లీ చికిత్సలు వికటించాయి. ఆరుగురు బాలింతల పరిస్థితి విషమంగా మారింది. వీరిలో నలుగురిని గాంధీ జనరల్‌ ఆసుపత్రికి, మరో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేస్తున్నారు. సుల్తాన్‌ బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలతో ప్రభుత్వం తాత్కాలికంగా సిజేరియన్లును నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్‌ థియేటర్లను శుభ్రం చేసి, ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్‌ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇటీవల మళ్లీ వాటిని తెరిచారు.

పడిపోయిన బీపీ... తీవ్ర రక్తస్రావం...: ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన బాధితుల్లో పది మందికి గురువారం సిజేరియన్‌ చేయగా, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. ఒక్కసారిగా బీపీ పడి పోవడంతో పాటు అధిక రక్తస్రావంతో బాధపడుతున్న మౌనిక, మీనాక్షి, రజిత, సాజియా బేగంను గాంధీ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా, స్వప్న, యమునలను ఉస్మానియాకు తరలించారు. ఫంగస్‌ ఉన్న సెలైన్‌ ఎక్కించడం వల్లే బాధితుల ఆరోగ్య పరిస్థితి విష మించిందని బంధువులు ఆరోపి స్తుండగా, తమ వద్దకు వచ్చిన వారంతా హైరిస్క్‌ బాధితులని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

సెలైన్‌ బాటిళ్లు వెనక్కి...: కాగా, ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్న ‘ప్రెసీనియస్‌’కంపెనీ సెలైన్‌ బాటిళ్ల వినియోగాన్ని నిలిపి వేశారు. వాటి ని వెంటనే సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు తిప్పి పంపాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడి కల్‌ ఎడ్యుకేషన్‌ ఆయా ఆసుపత్రు లకు ఆదేశాలు జారీ చేసింది. 

>
మరిన్ని వార్తలు