సంక్రాంతి కానుక... గగన విహారం

13 Jan, 2017 08:17 IST|Sakshi
సంక్రాంతి కానుక... గగన విహారం

నేటి నుంచి మళ్లీ హెలీ టూరిజం
17వ తేదీ వరకు అవకాశం


హైదరాబాద్‌: నగరవాసులకు సంక్రాంతి కానుకగా టూరిజం శాఖ అధికారులు హెలీ టూరిజాన్ని మళ్లీ పునరుద్ధరించారు. హుస్సేన్‌ సాగర్, నెక్లెస్‌ రోడ్డు, సాగర్‌ మధ్యలో ఉండే తథాగతుడిని వీక్షించి అక్కడికి కాస్త దూరంలో ఉండే బిర్లా మందిర్, శాసనసభా ప్రాంగణం, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట పరిస రాలు... హైటెక్‌ సిటీ, సైబరాబాద్‌లోని ఐటీ భవనాలన్నింటినీ నిమిషాల్లో వీక్షించాలను కునేవారికి ఇదో అవకాశం. గత ఏడాది మార్చి ఒకటిన నెక్లెస్‌ రోడ్డు, జలవిహార్‌ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతం లో హెలీటూరిజం కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు.

కొంతకాలం నడిచాక ఉపరాష్ట్ర పతి నగరానికి వచ్చిన నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధించి, ఏవియేషన్‌ అధికారులు అనుమతులు నిరాకరించారు. దానికితోడు బుకింగ్‌ పొరపాట్ల కారణంగా పర్యాటకులు ఆసక్తి చూపకపోవటంతో గగన విహారానికి బ్రేక్‌ పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్, డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అనుమతులను పొందారు. టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం తుంబే ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారిని ఒప్పించి హెలీటూరిజం ప్రారంభమయ్యేలా చేశారు.

ఐదురోజులే ఈ అవకాశం...
ఈ హెలీ టూరిజాన్ని ఐదురోజులకే పరి మితం చేశారు. 13 నుంచి 17 వరకు సాగు తుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు హెలీకాప్టర్‌ తిరుగు తుంది. ఒక్కొక్కరికి రూ.3,500 టికెట్‌ ధర చెల్లించాలి. నలుగురు కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ.3 వేలు, 12 మంది కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ. 2,500 చెల్లించాలి. మేరా ఈవెంట్స్‌ డాట్‌ కామ్‌లో బుకింగ్‌ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు