వ్యవసాయ మంత్రి వివరణివ్వాలి

13 May, 2017 03:57 IST|Sakshi
వ్యవసాయ మంత్రి వివరణివ్వాలి

►  ‘రైతులకు బేడీలు’పై కేంద్ర మంత్రి దత్తాత్రేయ
►  మిర్చి పంటకు రాష్ట్రం బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌


సాక్షి, న్యూఢిల్లీ: మిర్చి పంటకు మద్దతు ధర కోసం ధర్నా చేపట్టిన రైతులను అరెస్టు చేసి బేడీలేయడం దురదృష్టకరమని, దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వివరణ ఇవ్వాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. బేడీలు వేసే విషయంలో సుప్రీంకోర్టు మార్గ దర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలే దన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మాట్లాడుతూ.. రైతులకు రాజకీయ పార్టీల తో సంబంధం ఉండదని, వారు స్వతహాగా ధర్నా చేస్తే రాజకీయ పార్టీలను అంటగ డుతూ అరెస్టులు చేయడం సరికాదన్నారు.

మిర్చి రైతులను ఆదుకోడానికి రూ.5 వేల మద్దతు ధర, రూ.1,250 ఓవర్‌ హెడ్‌ చార్జీ లను కేంద్రం ప్రకటించిందని, దీన్ని అందిపు చ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కేంద్రం సాయా నికి రాష్ట్ర ప్రభుత్వమూ అదనంగా ధర ప్రకటిం చి ఉంటే రైతులకు ఉపయోగపడేదని, కానీ రాష్ట్ర సర్కారు ఈ విష యాన్ని పట్టించుకోకపో వడం దారుణమన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడానికి ఇప్పటికైనా పంటకు బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలోని రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడికైనా ఎగుమతి చేసి అమ్ముకునేలా వరంగల్, అచ్చంపేట, అదిలాబాద్, ఆత్మకూరు, భైంస, చొప్పదండి, దేవరకద్ర, జగిత్యాల, ఖమ్మం, జోగిపేట, కామారెడ్డి, వికారాబాద్‌ మార్కెట్ల ను ఈ–నామ్‌ వెబ్‌పోర్టల్‌కు అనుసంధానిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దత్తాత్రేయ కోరారు.

జామర్లు ఏర్పాటు చేయండి..
నీట్‌ పరీక్ష నిబంధనలను పునః సమీక్షించా లని కేంద్ర మానవ వనరనుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ను కోరినట్లు దత్తాత్రే య తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తనిఖీల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి బదులు ఎలక్ట్రానిక్‌ వస్తువులు పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని కోరారు.    

సీఎస్టీ నిధులు విడుదల చేయండి
తెలంగాణకు రావాల్సిన రూ.250 కోట్ల సీఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి జైట్లీని కోరినట్లు దత్తాత్రేయ వెల్లడించారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు మూడో విడత కింద రావాల్సిన రూ.450 కోట్లను కూడా విడుదల చేయాలన్నారు. పీఎఫ్‌ లబ్ధిదారులకు 8.65 శాతం వడ్డీ రేటు ఇవ్వడానికి జైట్లీ అగీకరించారని చెప్పారు.

సామాజిక సురక్ష కింద అంగన్‌వాడీలకు, సహాయకులకు పెన్షన్, పీఎఫ్, ఇళ్లు వంటి ప్రయోజనాలను అందించడానికి చర్యలు తీసుకుంటామని దత్తాత్రేయ వెల్లడించారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతోనూ సమావేశమైన దత్తాత్రేయ.. బడ్జెట్‌లో తెలంగాణకు ప్రకటించిన ఎయిమ్స్‌కు నిధులు మంజూరు చేయాలని, నిమ్స్‌ను అభివృద్ధి చేయాలని కోరారు.

>
మరిన్ని వార్తలు