అటవీ సిబ్బందికి ఎయిర్‌ అంబులెన్స్‌

21 Feb, 2017 02:40 IST|Sakshi
అటవీ సిబ్బందికి ఎయిర్‌ అంబులెన్స్‌

అపోలో ఆస్పత్రుల ఫౌండేషన్‌ వైస్‌చైర్‌పర్సన్‌ ఉపాసన వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల్లోని అడవుల్లో పనిచేసే అటవీ శాఖ సిబ్బంది, స్థానికులకు అత్యవసర వైద్య సాయం కోసం ఎయిర్‌ అంబులెన్స్‌ల సేవలను అందిస్తామని అపోలో ఆస్పత్రుల ఫౌండేషన్‌ వైస్‌చైర్‌పర్సన్‌ ఉపాసన తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌–ఇండియా కార్యకలాపా లు సాగించే ప్రాంతాల్లో ఈ సేవలతోపాటు వైద్య సాయాన్ని అందుబాటులోకి తెస్తామ న్నారు. ఈ మేరకు ఆ సంస్థతో కొనసా గుతున్న ఒప్పందాన్ని ఏప్రిల్‌ నుంచి మరో ఏడాదిపాటు పొడిగించుకుంటున్నట్లు వెల్ల డించారు. సోమవారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఉపాసన, డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్‌–ఇండియా సీఈవో రవిసింగ్‌లు ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.

ఉపాసన మాట్లాడుతూ అటవీ సిబ్బంది, స్థానికులు నిత్యం వన్యప్రాణులు, వేటగాళ్ల నుంచి ప్రమాదాలు ఎదుర్కొంటుం టారన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారికి వైద్య సాయం ఎంతో అవసరమన్నారు. అత్య వసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలతోపాటు నాణ్యమైన వైద్య సాయం అందిస్తామన్నారు. అలాగే వైద్య శిబి రాలూ ఏర్పాటు చేస్తామన్నారు. జంతువుల దాడుల్లో గాయపడటం, కొండల నుంచి జారి పడటం, మలేరియా,డెంగీ వంటి ప్రాణాం తక వ్యాధులేర్పడినప్పుడు, పాము కాట్లు తదితర ప్రమాద సందర్భాల్లో అటవీ సిబ్బం దితోపాటు స్థానికులకు ఈ ఒప్పందం ద్వారా వైద్య సేవలు అందిస్తామన్నారు.

గతేడాది నల్లమల అడవుల్లో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వందలాది మందిని కాపాడ గలిగామన్నారు. తెలంగాణ, ఏపీతోపాటు జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళ నాడు, కర్ణాటక, కేరళ అడవుల్లో పనిచేసే అటవీశాఖ సిబ్బంది సహా స్థానికులకు తక్షణ వైద్య సేవలు అంది స్తామన్నారు.

>
మరిన్ని వార్తలు