అంతర్గత భద్రత నిర్వహణే సవాల్

1 Nov, 2015 02:27 IST|Sakshi
అంతర్గత భద్రత నిర్వహణే సవాల్

ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో అజిత్ దోవల్
* ఈ సమస్యను పోలీసులే పోరాడి గెలవగలరని వ్యాఖ్య
* ఆత్మప్రబోధానుసారం నడుచుకోవాలని సూచన
* గౌరవ వందనం స్వీకరణ
 సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితుల కారణంగా యుద్ధరీతులు మారుతున్నాయని... ఈ తరుణంలో అంతర్గత భద్రత నిర్వహణే దేశానికి పెను సవాల్‌గా నిలవనుందని జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో జరిగిన 67 ఆర్‌ఆర్ (2014) బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొత్తం 156 మంది ట్రైనీల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 28 మంది మహిళలు సహా 141 మంది ఐపీఎస్ ట్రైనీలు, 15 మంది విదేశీ ట్రైనీలు ఉన్నారు. ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అంతర్గత భద్రత పెనుసవాళ్లను విసురుతోందని, దీన్ని అదుపు చేయలేని దేశాలు చీలుతున్నాయన్నారు. పౌర సమాజంలో జరిగే ఇంతటి కీలక సమస్యను పోలీసులు మాత్రమే పోరాడి గెలవగలరని దోవల్ వ్యాఖ్యానించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, ముఖ్యంగా సైబర్ క్రైం పెనుసవాళ్లు విసురుతోందన్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని దోవల్ సూచించారు. ఈ సందర్భంగా గౌతమబుద్ధుడు పేర్కొన్న 'ఆత్మ దిపోభవ'ను దోవల్  ప్రస్తావించారు. ట్రైనీ ఐపీఎస్‌లకు సమర్థ శిక్షణ అందించిన అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణను దోవల్ అభినందించారు.

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను నిర్వహించడం గర్వకారణమన్నారు. అంతకు ముందు ఎన్‌పీఏ డెరైక్టర్ అరుణ బహుగుణ మాట్లాడుతూ... ట్రైనీ ఐపీఎస్‌లకు ఇచ్చిన శిక్షణ తీరును వివరించారు. ఉత్తమ ఆల్‌రౌండ్ ప్రొబేషనర్‌గా నిలిచిన గుజరాత్ ట్రైనీ ఐపీఎస్ పార్థ్‌రాజ్‌సిన్హ్ ఎన్. గోహిల్‌కు ప్రధాన మంత్రి బాటన్, హోంమంత్రి రివాల్వర్‌లను దోవల్ ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరచిన మరికొందరికి కూడా అవార్డులను అందించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

విషమంగా ముఖేష్‌ గౌడ్‌ ఆరోగ్యం.. చికిత్స నిలిపివేత

ఆగస్టు 31లోగా ఆర్టీఐ కమిషనర్లను నియమించండి

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

మురళీధర్‌రావుపై హైకోర్టులో పిటిషన్‌

డెంగీ.. డేంజర్‌

పేదరికం వెంటాడినా.. పట్టుదల నిలబెట్టింది

భాష లేనిది.. నవ్వించే నిధి

గుట్టు విప్పుతున్న ఈ–పాస్‌..!

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

చేయూతనందిస్తే సత్తా చాటుతా..!

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

ప్రతిజ్ఞాపకం ‘పార్టీ’ నే

తమ్ముడిపై కొడవలితో దాడి

పాతబస్తీలో పెరుగుతున్న వలస కూలీలు

వానాకాలం... బండి భద్రం!

ఇటీవలే శ్రీలంక పర్యటన.. క్షణికావేశంలో ఆత్మహత్య

గ్రహం అనుగ్రహం (15-07-2019)

జరిమానాలకూ జడవడం లేదు!

బిగ్‌బాస్‌-3 షోపై కేసు నమోదు

రైతుబంధును గల్ఫ్‌ కార్మికులకు కూడా వర్తింపచేయండి

బీజేపీకి పెద్ద మొత్తంలో ఫండ్‌ ఎలా వస్తోంది?

మున్సిపల్‌ ఎన్నికలపై బీజేపీ సమావేశం

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

భర్తతో గొడవ.. బిల్డింగ్‌పై నుంచి దూకి..

బిగ్‌బాస్‌ ప్రతినిధులపై శ్వేతరెడ్డి ఫిర్యాదు

గ్రహం అనుగ్రహం (14-07-2019)

మంత్రులు ఈటల, కొప్పుల మానవత్వం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!