వైన్ షాపు.. వెల వెల..

11 Nov, 2016 07:58 IST|Sakshi
వైన్ షాపు.. వెల వెల..

‘గ్రేటర్’లో 60% పడిపోరుున మద్యం అమ్మకాలు  
పాత నోట్ల కారణంగా బోసిపోయిన వైన్ షాపులు, బార్లు

 పెద్ద నోట్ల రద్దు గ్రేటర్‌లో మందుబాబులకూ కష్టాలు తెచ్చిపెట్టింది. బుధ, గురువారాల్లో మహానగరం పరిధిలోని 300మద్యం దుకాణాలు, 571 బార్లలో మద్యం అమ్మకాలు 60% మేర పడిపోరుునట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణంలో కొనుగోలు కోసం వస్తున్న వారు రూ.500, రూ.1,000 నోట్లను తీసుకువస్తుండడంతో దుకాణదారులు ఆ నోట్లను తిరస్కరిస్తున్నారు. దీంతో 50 నుంచి 60 శాతం మంది మద్యం కొనకుండానే తిరిగి వెళ్లిపోతున్నారని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. నగర శివారు ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి కటాన్‌ల కొద్ది మద్యం కొనుగోలు చేసేవారు సైతం దిక్కులేకపోవడంతో దుకాణాలు వెలవెలబోతున్నారుు. కోఠి రంగ్‌మహల్ చౌరస్తాలోని బగ్గా వైన్‌‌సలో ఈ రెండు రోజుల్లో 40% అమ్మకాలు మాత్రమే జరిగినట్టు దుకాణం యజమానులు తెలిపారు.

హైదరాబాద్ వైన్ షాపుల నిర్వాహకులు వంద నోట్లు ఉంటేనే మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. కొన్ని దుకాణాల్లో మాత్రం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా అమ్మకాలు సాగుతున్నారుు. మద్యం ప్రియులకు డెబిట్, క్రెడిట్ కార్డుల వల్ల మద్యం సీసాలు దొరుకుతుండడంతో వారు కొంత ఊరట చెందుతున్నారు. వైన్ షాపు నిర్వాహకులు సైతం డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నవారికి మాత్రం ఆహ్వానించి కార్డు స్వైప్ చేసుకుని మద్యం బాటిళ్లను వారి చేతుల్లో పెడుతున్నారు.

 బార్లు సైతం వెలవెల..
పెద్ద నోట్ల రద్దుతో బార్లు కూడా వెలవెలబోతున్నారుు. బారు వద్ద పార్కింగ్ నుంచి మొదలుకుని వెరుుటర్ వరకు వంద నోట్లు ఉన్నాయా అని మందుబాబులను ముందే ప్రశ్నిస్తున్నారు. బారులో బిల్లు వందల నుంచి వేల రూపాయల వరకు అరుునా దర్జాగా కట్టి వెరుుటర్‌కు ఓ వంద టిప్పు ఇచ్చే వాళ్లను సైతం వంద నోటు ఉంటేనే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దీంతో చాలా బార్లు మందుబాబులు లేక వెలవెలబోతున్నారుు.

మరిన్ని వార్తలు