రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

3 Jun, 2016 15:16 IST|Sakshi
రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది.  ఏపీలో నాలుగు, తెలంగాణలో రెండు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వారి ఎన్నిక లాంఛనమే అయింది. జూన్ 11న జరిగే ఎన్నికల్లో మొత్తం 15 రాష్ట్రాల నుంచి 57 స్థానాలకు పోటీ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, టీడీపీ నుంచి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, బీజేపీ నుంచి సురేష్ ప్రభు, తెలంగాణ నుంచి డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్‌, సుజనా చౌదరి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డీ శ్రీనివాస్ మరికాసేపట్లో ధ్రువీకరణ పత్రాలు అందుకోనున్నారు. కాగా విజయ సాయిరెడ్డి ఈ నెల 6న ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోనున్నారు.

 

మరిన్ని వార్తలు