అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే...

1 Nov, 2014 00:53 IST|Sakshi
అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే...

5 నుంచి అమలుకు జీహెచ్‌ఎంసీ సిద్ధం

సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల్లోనూ కాగితపు రహిత(పేపర్‌లెస్) విధానాన్ని..‘ఈ-ఆఫీస్’ (ఆన్‌లైన్ ద్వారానే అన్ని ఫైళ్లు)ను అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తొలుత టౌన్‌ప్లానింగ్ విభాగంలో అమలు చేయనున్నారు. భవన నిర్మాణాలు పూర్తయ్యాక జారీ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్‌ను ఇకపై ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జారీ చేయనున్నారు. ఈ నెల 5 నుంచి ఈ విధానాన్ని ప్రారంభించేందుకుఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఇదంతా కాగి తాల ద్వారా సాగేది. భవన నిర్మాణాలు పూర్తయిన యజమానులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం తమ దరఖాస్తులు, అవసరమైన పత్రాలు, ఫొటోలను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్ ద్వారానే జారీ చే స్తారు. సంబంధిత అధికారి డిజి టల్ సంతకంతో కూడిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ విధానం ద్వారా ప్రజలు తమ ఫైల్ ఏ సమయంలో.. ఎవరి వద్ద ఉందో ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. తొలుత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ జారీ చేసి...క్రమంగా భవన నిర్మాణ అనుమతులు సహా అన్ని అంశాలనూ ఆన్‌లైన్‌తో ముడిపెట్టనున్నారు.

దీనికోసం ఎన్‌ఐసీ నుంచి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకుంటున్నారు. దరఖాస్తు దారులు ఇకపై జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సంబంధిత ఫారంలో వివరాలు నమోదు చేసి, ఫీజును ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ల ద్వారా చెల్లిం చవచ్చు. ఆ మేరకు అక్‌నాలెడ్జ్‌మెంట్ అందుతుంది. భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకునేవారికి ఎంతో సమయం కలిసి వస్తుంది. జీహెచ్ ఎంసీలోని అన్ని విభాగాల్లోనూ ఈ-ఆఫీస్ అమలుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు తీసుకోవడం.. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాల్లో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్‌లెసైన్సు, జనన మరణ ధ్రువీకరణ తదితర అన్ని విభాగాల్లోనూ ఆన్‌లైన్ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోనే ఏ కార్పొరేషన్‌లో లేని విధంగా అన్ని పనులనూ ఆన్‌లైన్ ద్వారా చేసేం దుకు సిద్ధమవుతున్న జీహెచ్‌ఎంసీ అందుకు తగిన విధంగా సిద్ధమవుతోంది. 

మరిన్ని వార్తలు