పెన్షనర్లకు కరువుభృతి పెంపు

9 Sep, 2016 04:04 IST|Sakshi
పెన్షనర్లకు కరువుభృతి పెంపు

జనవరి నుంచే వర్తింపు
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు కరువు భృతిని (డీఆర్) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు ప్రస్తుతం 15.196 శాతం డీఆర్ అమల్లో ఉండగా దీనికి అదనంగా 3.144 శాతం కలిపి 18.340 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు (జీవో నంబర్ 112) జారీ చేశారు. ప్రభుత్వోద్యోగులకు ఇటీవల కరువు భత్యం పెంచిన తరహాలోనే పెన్షనర్లకు ప్రభుత్వం డీఆర్‌ను వర్తింపజేసింది. జనవరి నుంచి చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్‌తో కలిపి చెల్లించనుంది. అక్టోబర్ 1న బకాయిలతోపాటు పెరిగిన డీఆర్‌తో కూడిన పెన్షన్ పెన్షనర్లకు అందనుంది.

2013 జూలై 1 తర్వాత రిటైరైన వారితోపాటు అప్పటికే రిటైరై పెన్షన్ అందుకుంటున్న వారందరికీ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థికశాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు