పరారీలో యాంకర్‌ ప్రదీప్‌ 

4 Jan, 2018 03:10 IST|Sakshi

ఇల్లు, కార్యాలయం చుట్టూ ట్రాఫిక్‌ పోలీసుల ప్రదక్షిణలు 

హైదరాబాద్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ టీవీ యాంకర్‌ మాచిరాజు ప్రదీప్‌ (35) పరారీలో ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బేగంపేట, గోషామహల్‌లో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ సెంటర్లకు తల్లి లేదా భార్యతో కౌన్సెలింగ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. దీంతో నోటీసులు అందించేందుకు పోలీసులు బుధవారం మణికొండలోని ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది.

కూకట్‌పల్లిలోని కార్యాలయానికి వెళ్లిన పోలీసులకు అక్కడ కూడా చుక్కెదురైంది. ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. గురువారం కూడా కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే శాంతిభద్రతల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా నియంత్రణకు కళాకారుల గీతాలు 

కన్నతల్లి కడచూపునకు నోచుకోక..

నిండు గర్భిణి పురిటి కష్టాలు

నేరాల రేటు ‘డౌన్‌’ 

మ.. మ.. మాస్క్‌!

సినిమా

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌