ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా

19 Mar, 2016 12:22 IST|Sakshi

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం దద్దరిల్లింది. ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో న్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు ఎంతకూ వెనక్కి తక్కకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ సభ మూడోసారి ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. రోజాను సభకు అనుమతించాలంటూ నినాదాలు చేయగా పరిస్థితిని కంట్రోల్ చేయలేని పక్షంలో సభను సోమవారానికి వాయిదావేశారు.

అంతకుముందు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సభకు నల్ల దుస్తులతో వచ్చి తమ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడం, రోజాను ఎందుకు అనుమతించడం లేదంటూ పదే పదే అడుగుతున్న క్రమంలో రెండు సార్లు సభ వాయిదా పడిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు