బర్రెను జాతీయ జంతువుగా ప్రకటించాలి

27 Jul, 2014 03:42 IST|Sakshi

 ప్రొఫెసర్ కంచ ఐలయ్య
 హైదరాబాద్: దేశంలో బర్రెలే అత్యధికంగా పాలు ఇస్తున్నందున బర్రెనే జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పేర్కొన్నారు. దళితులు సైతం జాతీయ జంతువుగా పూజించాలన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ..

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయటంతో పాటు ప్రతి గ్రామంలో కిండర్ గార్డెన్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని, గర్భస్థ శిశువు నుంచి ప్రభుత్వమే పోషకాహారం అందించాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీనియర్ జర్నలిస్టు సతీష్ చంద్ర, సామాజికవేత్త సాంబశివరావు, రచయిత జయరాజు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు