డీఎన్‌ఏలో మరో సమాచార వ్యవస్థ

10 Jun, 2016 00:48 IST|Sakshi
డీఎన్‌ఏలో మరో సమాచార వ్యవస్థ

మన శరీర కణాల్లోని క్రోమోజోములపై ఉండే జన్యువులే మన రూపురేఖలు, ఆరోగ్య అంశాలను నిర్ణయిస్తాయని భావిస్తున్నాం. కానీ ఈ నియంత్రణలో ఒక్క జన్యువులే గాకుండా మరో సమాచార వ్యవస్థ కూడా భాగం పంచుకుంటోందని లెయిడెన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీరంలోని కణాలన్నింటిలో ఉండే డీఎన్‌ఏ పోగులు, జన్యువులు ఒకేలా ఉన్నా... ఒక్కో అవయవం ఉత్పత్తి చేసే ప్రొటీన్లు, ఎంజైమ్‌లు వేర్వేరుగా ఎందుకు ఉంటాయన్నది శాస్త్రవేత్తలకు చాలాకాలంగా పజిల్‌గానే ఉంది.

జన్యు సమాచారానికి అదనంగా మరో సమాచార వ్యవస్థ ఏదో కణాల్లో ఉండి ఉండాలని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. దీనినే లెయిడన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అసలు ఈ రెండో సమాచార వ్యవస్థ ఏమిటో తెలుసా? ఒక్కో కణంలోని డీఎన్‌ఏ ఉండ చుట్టుకుని ఉండే తీరే. ఇలా చుట్టుకుని ఉండడం ద్వారా దానిలో కొన్ని జన్యువుల సమాచారం మాత్రమే చదివేందుకు వీలవుతుందని.. అందుకు అనుగుణంగానే ప్రొటీన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంటే కంటిలో ఉండే కణాల్లోని డీఎన్‌ఏ పోగు అక్కడ అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు మాత్రమే కనిపించేలా ఉండచుట్టుకుని ఉంటే... గుండె కణాల్లో ఆ అవయవానికి తగ్గట్టుగా ముడతలు పడి ఉంటుందన్నమాట! లెయిడెన్ శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా బేకర్ ఈస్ట్, ఫిషన్ ఈస్ట్‌ల డీఎన్‌ఏలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు.    - సాక్షి, హైదరాబాద్

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

వేలిముద్రతో ‘వెరీ ఫాస్ట్‌’

సినీ నటి డాటా చోరీ

ఒకరి వెంట ఒకరు..

ఆ బస్సు ఎక్కితే అంతే సంగతులు..!

కనుచూపు మేర కనిపించని ‘కిరోసిన్‌ ఫ్రీ సిటీ’

వయసు 20.. బరువు 80..

ఎన్‌ఆర్‌ఐ మహిళలు మరింత సేఫ్‌

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే

దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు

గ్రహం అనుగ్రహం (18-07-2019)

డీఐఎంఎస్‌లో ఏసీబీ తనిఖీలు

ఆమెకు రక్ష

ఉగ్రవాదంపై ‘వర్చువల్‌’ పోరు!

అజంతా, ఎల్లోరా గుహలు కూల్చేస్తారా? 

నల్లమలలో అణు అలజడి!

కోర్టు ధిక్కార కేసులో శిక్షల అమలు నిలిపివేత

సిటీకి దూపైతాంది

‘ఐ లవ్‌ మై జాబ్‌’ 

ఎలక్ట్రిక్‌ బస్సు సిటీ గడప దాటదా?

24 నుంచి ఇంజనీరింగ్‌ చివరి దశ కౌన్సెలింగ్‌

‘పుర’ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం 

భాగ్యనగరానికి జపాన్‌ జంగల్‌

ఎన్నికలకు నో చెప్పిన హైకోర్టు

హైదరాబాద్‌లో నీటికి ఢోకా లేదు..

కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్యకు ఊరట

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..