'అండమాన్‌కైనా వెళ్తాం.. ఆంధ్రాకు వెళ్లం'

1 Jul, 2016 21:26 IST|Sakshi

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్) : ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్( బీఎస్‌ఎన్‌ఎల్) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్‌గా విడిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం అధికారికంగా ఉత్వరులు రావడంతో అబిడ్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.

అనంతరం జేఏసీ చైర్మన్ జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... ఆలిండియా ఉద్యోగులుగా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు విధి నిర్వహణకు అండమాన్ దీవులకైనా వెళ్లేందుకు సిద్థంగా ఉన్నారని.. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం వెళ్లబోమని స్పష్టం చేశారు. ఆప్షన్ విధానంలో ఎవరైనా తెలంగాణ ప్రాంత ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయిస్తే ఉద్యమిస్తామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు