కాళేశ్వరంపై ఏపీ కొత్త పేచీ..!

9 Sep, 2017 02:17 IST|Sakshi
కాళేశ్వరంపై ఏపీ కొత్త పేచీ..!

తెలంగాణ, మహారాష్ట్ర ఒప్పందం కుదిరిన ఏడాది తర్వాత అభ్యంతరం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్రపదేశ్‌ కొత్త పేచీ పెడుతోంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం, నీటి వినియోగానికి సం బంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరిన ఏడాది తరు వాత ఇప్పుడు అభ్యంతరాలు లేవనెత్తుతోంది. తమను సంప్రదించకుండా ఒప్పందాలు ఎలా చేసుకుంటారని, ఇది తమ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టంటూ కేంద్ర జల వనరుల శాఖకు  ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై అభిప్రాయా లు తెలపాలని, కేంద్రం బోర్డు నుంచి వివరణ కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిం ది. నిజానికి కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంపై గతేడాది ఆగస్టు 23న మహారాష్ట్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఒప్పందం మేరకు బ్యారేజీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ జరగ్గా, ఈ నెల 27న మహారాష్ట్రలో ఈ కార్యక్రమం జర గాల్సి ఉంది. ఈ సమయంలో ఈ ఒప్పందాల ను ప్రశ్నిస్తూ ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బేసిన్‌లో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టినా తమకు తెలపాల్సి ఉందని, అయితే తెలంగాణ తమను సంప్రదించకుండా మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుందని పేర్కొంది. గోదావరిలో ఎలాంటి నీటి వినియోగానికైనా కేంద్రం, బోర్డుతో పాటు తమ ఆమోదం తప్పనిసరైనప్పటికీ, అలాంటి దేమీ జరగలేదని వివరించింది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులు పట్టకుం డా ఎగువ రాష్ట్రాలు మాట్లాడుకుంటే సరిపో తుందా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన కేంద్రం, బోర్డు అభిప్రాయాన్ని కోరుతూ శుక్రవారం లేఖలు రాసింది. 

మరిన్ని వార్తలు