లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

14 Sep, 2016 13:04 IST|Sakshi
లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు

హైదరాబాద్: 'స్విస్ చాలెంజ్‌‌' విధానంపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఏపీ అడ్వొకేట్ జనరల్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్‌ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని రేపు (గురువారం) పరిశీలిస్తామని తెలిపింది.

ప్రభుత్వానికొచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయకుండానే సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ గత నెల 18న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్.. ఆ నోటిఫికేషన్‌కు సవరణలు చేస్తూ గత నెల 28న జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలిపేసింది. దీంతో ఈ ప్రక్రియను సీఆర్‌డీఏ పక్కన పెట్టింది. హైకోర్టు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తామని పేర్కొన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న తిరిగి 'స్విస్ చాలెంజ్‌‌'పై హైకోర్టు విచారించనుంది.

మరిన్ని వార్తలు