'గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయింది'

9 Oct, 2016 09:56 IST|Sakshi
'గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయింది'

సికింద్రాబాద్: గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయిందని కిమ్స్ వైద్యులు చనిపోయారు. 68 రోజుల ఉపవాసం వల్ల ఆమె పేగులు, కిడ్నీలు ఎండిపోయాయని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. గుండె సమస్య రావడం వల్లే ఆరాధనను తల్లి దండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారని, అయితే మార్గం మధ్యలోనే ఆమె చనిపోయిందని వారు వెల్లడించారు. వ్యాపారంలో నష్ట వచ్చిందని సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా అనే బంగారు నగల వ్యాపారి ఓ మత గురువు చెప్పిన సలహా విని తన 13 ఏళ్ల కుమార్తె ఆరాధనతో 68రోజుల ఉపవాస దీక్ష చేయించారు.

సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న బాలికను కేవలం మంచినీళ్లను మాత్రమే తాగేలా చూశారు. అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలనే కండీషన్ పెట్టారు. ఫలితంగా ఈ దీక్ష ఈ నెల (అక్టోబర్) 3వ తేదీకి ముగిసింది. కానీ అప్పటికే ఆరాధన డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలో కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. మరణించింది.

దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరాధన తండ్రి మూఢాచారంతో ఆమెను 68 రోజులు ఉపవాసం ఉంచారని వారు పేర్కొన్నారు. ఆమె డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా పాడవడంతో మరణించినట్లు కిమ్స్ వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు