బాబుతో కొట్లాడుతున్నామా? మీతో పోరాడుతున్నామా?

31 Aug, 2015 12:46 IST|Sakshi
బాబుతో కొట్లాడుతున్నామా? మీతో పోరాడుతున్నామా?

హైదరాబాద్ : వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభలో ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అయితే అందుకు అంగీకరించని స్పీకర్ కోడెల శివప్రసాద్..  ప్రశ్నోత్తరాలు చేపడతామని ప్రకటించడంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎప్పుడైనా ప్రశ్నోత్తరాలు జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమైన అంశాలను తప్పుదోవ పట్టించవద్దని, చర్చ జరగకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.

శాసనసభ సమావేశాలు జరిగేది ఐదు రోజులు మాత్రమే అని, 15 రోజుల సమావేశాలు జరపాలని కోరినా కాదన్నారని వైఎస్ జగన్ అన్నారు.  ప్రత్యేక హోదా కోసం పలువురు ప్రాణత్యాగం  చేశారని...హోదాపై తీర్మానం ఇచ్చినా...చర్చ జరిపేందుకు మాత్రం అనుమతి ఇవ్వటం లేదన్నారు.  

ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇవ్వరని, అదే చంద్రబాబు మాత్రం 15 నిమిషాలు పాటు మాట్లాడేందుకు మాత్రం అనుమతి ఇస్తారని అన్నారు. తాము సభలో అధికారపక్షంతో కొట్లాడుతున్నామా... మీతో పోరాడుతున్నామా అనేది అర్థం కావటం లేదని వైఎస్ జగన్ అన్నారు.

>
మరిన్ని వార్తలు