మే నెల నుంచి పోస్టాఫీసుల ద్వారానే ఆసరా

18 Apr, 2017 01:55 IST|Sakshi
మే నెల నుంచి పోస్టాఫీసుల ద్వారానే ఆసరా

అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్లను వచ్చేనెల నుంచి పూర్తిగా పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సోమవారం ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ఆసరా లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ లేదా ఐరిస్‌ విధానం ద్వారానే ఇకపై పింఛన్‌ల పంపిణీ జరగాలని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోపే లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్ము పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పోస్టాఫీసులోనూ ఐరిస్‌ పరికరాన్ని ఏర్పాటు చేయాలని తపాలా అధికారులను మంత్రి కోరారు. కూలీలకు జాబ్‌ కార్డులు ఇప్పించడంతో పాటు, పెద్ద ఎత్తున పనులు చేపట్టేలా మహిళా సంఘాలు చొరవ చూపాలని, ఆయా సంఘాలను చైతన్య పరిచేందుకు వీవోఏలను వినియోగించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు