శాసనసభా సంఘాల తొలిభేటీ

30 Apr, 2015 03:37 IST|Sakshi

హైదరాబాద్: గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏర్పాటైన ప్రభుత్వ పద్దుల కమిటీ(పీఏసీ), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ), అంచనాల కమిటీ (ఎస్టిమేట్స్) బుధవారం అసెంబ్లీలోని సమావేశ మందిరాల్లో వేర్వురుగా భేటీ అయ్యాయి. ఈ కమిటీలు ఏర్పాటయ్యాక తొలిసారిగా జరిగిన భేటీ కావడంతో కమిటీల పని విధానానికి సంబంధించి భవిష్యత్ కార్యక్రమాలను నిర్ధేంచుకోవడం, అధికారులతో పరిచయాలకే పరిమితమయ్యా యి. ఈ సమావేశాలకు స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హాజరయ్యారు. చైర్మన్ పి.కిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశానికి అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.

మే 11న మరోమారు సమావేశం కావాలని, దీనికి అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరు కావాలని నిర్ణయించారు. ఎన్.దివాకర్‌బాబు అధ్యక్షతన జరిగిన పీయూసీ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థలపై, కార్పొరేషన్లపై సమీక్షలు జరపాలని నిర్ణయించారు. కమిటీ మే 18న తిరిగి సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. అన్ని జిల్లాల్లో పర్యటించాలని ఎస్టిమేట్స్ కమిటీ నిర్ణయించింది. కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మే 12 నుంచి మూడు రోజుల పాటు వరంగల్ జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. కమిటీ మే 11న భేటీ కావాలని నిర్ణయించినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు