బార్లీతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్

10 Jun, 2016 00:40 IST|Sakshi
బార్లీతో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్

గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలని చూస్తున్నారా.. అయితే బార్లీ తినడం మొదలుపెట్టండి. బార్లీ అటు ఎల్‌డీఎల్‌తోపాటు నాన్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను కూడా ఏడు శాతం వరకూ తగ్గించగలదని కెనెడాలోని సెయింట్ మైకేల్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు రకాల కొలెస్ట్రాల్‌లు గుండె జబ్బులకు కారణమవుతాయని అంటున్నారు. గుండెకు బార్లీ చేసే మేలు గురించి చాలాకాలంగా తెలిసినా...

ఎల్‌డీఎల్, నాన్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌లపై దీని ప్రభావం ఎంతమేరకు ఉంటుందనేది తమ అధ్యయనం ద్వారా వెల్లడైందని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ వ్లాదిమిర్ వుక్సన్ తెలిపారు. ఓట్స్‌తో పోలిస్తే బార్లీలో పీచు పదార్థం, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికే కాకుండా సాధారణ వ్యక్తులకూ ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.    - సాక్షి, హైదరాబాద్

మరిన్ని వార్తలు