మహిళలకు బతుకమ్మ కానుక

27 Aug, 2017 01:59 IST|Sakshi
మహిళలకు బతుకమ్మ కానుక
- 1,04,57,610 మందికి చేనేత చీరలు
సెప్టెంబర్‌ 18, 19, 20 తేదీల్లో పంపిణీ
కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ అందజేత 
దీనితో చేనేత కార్మికులకు చేయూత 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన 
 
సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో ని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలోని 1,04,57,610 మందికి సెప్టెంబర్‌ 18, 19, 20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడిం చారు. కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ చీరలు పంచనున్నట్లు తెలిపారు. పవర్‌ లూమ్, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం వారు నేసిన చీరలనే కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నామన్నారు. పేద మహిళలందరికీ చీరలందించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు.

చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించా ల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘తెలంగాణ ప్రజలంతా కులమతాలకతీతంగా బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకుంటారు. బతుకమ్మ రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన పండు గ. కుటుంబ బంధాలకు ఈ పండుగ ప్రతీక. ప్రతీ ఆడపడుచు తన సొంతిం టికి వెళ్లి ఆనందంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను ప్రజలంతా మరింత సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్‌ సందర్భంగా క్రై స్తవులకు దుస్తులు పంపిణీ చేశాం. కానీ బతుక మ్మ చీరలను మాత్రం రాష్ట్రంలోని హిం దూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలం దరికీ పంపిణీ చేయాలని నిర్ణయిం చాం’’అని సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా పంపిణీ చేసే చీరల నాణ్యతను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చీరలను పంపిణీ చేసే విధానంపై అధికారులతో మాట్లాడి షెడ్యూల్‌ ఖరారు చేశారు.
 
చేనేత కార్మికుల కోసమే
‘‘మరమగ్గాలు, చేనేత మగ్గాలను ఆధారం చేసుకుని బతికే కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పనిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేం దుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే ఈ చీరలను వారినుంచే కొనుగోలు చేస్తున్నది. దీనివల్ల కార్మికు లకు ఉపాధి దొరుకుతుంది. పనికి హామీ లభిస్తున్నది. బతుకుకు భరోసా ఏర్పడుతున్నది. చీరల పంపిణీ వల్ల మహిళల పండుగ సంబురం రెట్టింపు అవడంతో పాటు నేత కార్మికులు ఉపాధి పొంది సంతృప్తి పడుతున్నారు. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరమగ్గాలను ఆధునీకరించే పని వేగంగా పూర్తి చేస్తున్నాం.

నూలు, రసా యనాలను 50 శాతం సబ్సిడీపై అంది స్తున్నం. దీని ద్వారా నేత కార్మికులకు లాభం జరుగుతుంది’’ అని ముఖ్య మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు లేఖ రాయాలని మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో పౌరస రఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శ న్‌రెడ్డి, ఎండీ సీవీ ఆనంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్, హ్యాం డ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్, తదితరులు పాల్గొన్నారు. 
 
చీరల తయారీకి ఆర్డర్‌ 
రాష్ట్రంలో కోటీ 4లక్షల పైగా ఉన్న పేద మహిళలకు పంపిణీ చేయడానికి అంతే సంఖ్యలో చీరలు తయా రు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చా రు. ఉత్పత్తి కేంద్రాల నుంచి చీరలు సెప్టెంబర్‌ 2వ వారంలో జిల్లా కేం ద్రాలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు చీరలను పంపుతారు. రేషన్‌ షాపుల వారీగా సెప్టెంబర్‌ 18, 19, 20 తేదీల్లో ప్రత్యే కంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో మహి ళలకు చీరలు పంపిణీ చేస్తారు. సదరు మహి ళ పంపిణీ కేంద్రానికి రాలేని పరిస్థితి ఉంటే ఆమె భర్తకానీ, తల్లి గాని, తండ్రిగానీ తీసుకుపోవచ్చు. ఆధార్‌ కార్డు గానీ, ఓటర్‌ గుర్తింపు కార్డు కానీ, మరేదైనా ఫోటో గుర్తింపు కానీ చూపించాల్సి ఉంటుంది.  
మరిన్ని వార్తలు