భవిష్యం

9 Dec, 2014 00:24 IST|Sakshi
భవిష్యం

మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్యకర మైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాల సందర్శనం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల స్థితి.
 
వృషభం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యయప్రయాసలు.
 
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
కర్కాటకం: వ్యయప్రయాసలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
సింహం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. పనులు విజయవంతంగా సాగుతాయి.  ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
 
తుల: కొత్తగా రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
 
వృశ్చికం: దూరప్రయాణాలు ఉంటాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. బంధువులతో విభేదాలు. విద్యార్థులకు కొంత నిరాశ. వృత్తి, వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి.
 
ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 
మకరం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
 
కుంభం: పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
 
మీనం: మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు.
 - సింహంభట్ల సుబ్బారావు
 
 

మరిన్ని వార్తలు