రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

29 Dec, 2015 11:26 IST|Sakshi

బైక్, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జీడిమెట్ల - నర్సాపూర్ రహదారిపై మైలాన్ కంపెనీ సమయంలో చోటుచేసుకుంది. జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్న బాలకృష్ణ(25), నాగేంద్ర(26) బైక్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బాలకృష్ణ అక్కడికక్కడే చనిపోగా నాగేంద్ర తీవ్ర గాయాలపాలయ్యాడు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం.

 

మరిన్ని వార్తలు