బిస్కెట్లు.. విత్తనాలు.. స్టాంప్స్‌ కాదేదీ డ్రగ్స్‌కు అనర్హం!

20 Jul, 2017 03:29 IST|Sakshi
బిస్కెట్లు.. విత్తనాలు.. స్టాంప్స్‌ కాదేదీ డ్రగ్స్‌కు అనర్హం!
సాక్షి, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల సరఫరాదారులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు అన్వేసి స్తున్నారు. యాసిడ్‌ డైథైలామెడ్‌(ఎల్‌ఎస్‌డీ) డ్రగ్‌ను బిస్కెట్లుగా.. లైసర్జిక్‌ యాసిడ్‌ ఎమైడ్‌ (ఎల్‌ఎస్‌ఏ) డ్రగ్‌ను విత్తనాల రూపంలో సరఫరా చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బిస్కెట్లు, విత్తుల రూపంలో డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరు నల్లజాతీయులతో పాటు మొత్తం ఆరుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. 
 
గోకర్ణలో ఏర్పడిన పరిచయాలతో..
కూకట్‌పల్లికి చెందిన ఎన్‌.రఘువంశీధర్‌రెడ్డి బీటెక్‌ పూర్తి చేసిశాడు. 2015లో బెంగళూరు వెళ్లిన ఇతగాడు అక్కడో కాల్‌ సెంటర్‌లో విధు లు నిర్వర్తించాడు. అక్కడ గంజాయి, ఎల్‌ఎస్‌డీ, కొౖకైన్, ఎండీఎంఏ(ఎక్స్‌టసీ) అలవాటయ్యా యి. ఏప్రిల్‌లో కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతానికి వెళ్లిన వంశీధర్‌రెడ్డికి.. అక్కడ బెంగళూరుకు చెందిన క్రిస్టోఫర్‌తో పరిచయమైంది. అతడి ద్వారా పరిచయమైన వారి నుంచి ఒక్కో ఎల్‌ఎస్‌డీ స్టాంప్‌ను రూ.వెయ్యికి ఖరీదు చేసి రూ.1,500 నుంచి రూ.2 వేలకు విక్రయించే వాడు. ఎల్‌ఎస్‌ఏ విత్తనాలు, చెరస్‌ తదితర డ్రగ్స్‌నూ కొనిఅమ్మేవాడు.
 
డార్క్‌ నెట్‌ నుంచి మరికొన్ని..
వంశీధర్‌కు సికింద్రాబాద్, కూకట్‌పల్లికి చెందిన అభినవ్‌ మహేంద్ర, వి.మల్లికార్జున్‌రావుతో పరి చయం ఏర్పడింది. వీరిద్దరూ డార్క్‌ నెట్‌లో ఉండే టోర్‌ బ్రౌజర్‌ వినియోగించి యూరోపి యన్‌ దేశాల నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేస్తున్నారు. ఎస్‌ఎల్‌డీ డ్రాప్స్‌తో కూడిన బిస్కెట్లతో పాటు ఎల్‌ఎస్‌ఏ సీడ్స్, ఎండీఎంఏ, కొకైన్‌ పోస్టల్‌లో ఇక్కడకు రప్పిస్తున్నారు. వీటిని గ్రాము రూ.4 వేలకు కొంటూ కొంత వినియోగిస్తూ.. మరికొంత వంశీధర్‌తో పాటు ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇక గోవాలో పరిచయమైన నల్లజాతీయుడు చికా అలియాస్‌ జాక్‌ ద్వారానూ డ్రగ్స్‌ ఖరీదు చేసి అమ్ముతున్నాడు.
 
హుక్కాతో మొదలై డ్రగ్స్‌ వరకు..
మరో డ్రగ్స్‌ గ్యాంగ్‌ను కూడా బుధవారం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. న్యూబోయగూడకు చెందిన పి.రేవంత్‌ బీటెక్‌ పూర్తి చేసి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో హుక్కా సెంటర్లకు వెళ్లే ఇతగాడికి ఆ తర్వాత గంజాయి అలవాటైంది. తరచు గోవా వెళ్లే రేవంత్‌కు అక్కడ కొకైన్, ఎండీఎంఏ, చెరస్, ఎల్‌ఎస్‌డీ అలవాటయ్యాయి. అక్కడ తక్కువ ధరకు వీటిని ఖరీదు చేసి.. నగరానికి తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తూ పెడ్లర్‌గా మారాడు. డ్రగ్స్‌ విక్రయిస్తూ గతేడాది జనవరిలో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి జైలుకెళ్లాడు. నెల క్రితం గోవా వెళ్లిన రేవంత్‌ 20 ఎల్‌ఎస్‌డీ స్టాంపులు ఖరీదు చేసి.. సైఫాబాద్‌కు చెందిన నజీబ్‌ ఖాన్, లక్డీకపూల్‌ వాసి జైన్‌ ఖాన్‌కు అమ్మాడు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం వీరిని పట్టుకుని 11 ఎల్‌ఎస్‌డీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మొదటి గ్యాంగ్‌కు చెందిన ఆరుగురిని బంజారాహిల్స్‌ పోలీసులకు, రెండో గ్యాంగ్‌ను సైఫాబాద్‌ పోలీసులకు అప్పగిస్తున్నామని డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు.
 
ముఠాను పట్టుకుంటే మరొకరు..
డ్రగ్స్‌ను ఎక్కువగా విక్రయించాలని భావించిన వంశీధర్‌.. చికా, అభినవ్, మల్లికార్జున్‌కు ఒకేసారి ఆర్డర్‌ ఇచ్చాడు. బుధ వారం వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 లోని ఓ రెస్టారెంట్‌ సమీపంలో కలుసుకున్నా రు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడిచేసి ఐదుగురినీ అదుపు లోకి తీసుకున్నారు. మణికొండలో నివసిస్తున్న మరో నైజీరియన్‌ లక్కీ ఇదే వ్యాపారం చేస్తున్నట్లు చికా విచారణలో వెల్లడించడంతో అతడినీ పట్టుకున్నారు. వీరి నుంచి 300 గ్రాముల కొకైన్, 42 గ్రాముల ఎండీఎంఏ, 5 ఎల్‌ఎస్‌డీ స్టాంప్స్, 11 ఎల్‌ఎస్‌ఏ విత్తనాలు, కారు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వార్తలు