ఆర్డీవోలను వేధిస్తున్న ప్రభుత్వం: బీజేపీ

19 Nov, 2016 01:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: 50 మంది ఆర్‌డీవో స్థారుు అధికారులకు నాలుగు నెలలుగా పోస్టింగులు ఇవ్వకుండా, వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కొత్త జిల్లాల్లో అధికారుల కొరత దృష్ట్యా తక్షణమే ఆర్డీవోలతోపాటు ఖాళీగా ఉన్న అధికారులకు పోస్టింగులిచ్చి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తగినంత మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు లేరని, పరిపాలనా సౌలభ్యం కోసం మరింత మందిని కేటారుుంచాలంటూ పదేపదే కేంద్రాన్ని కోరుతున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అధికారుల సేవలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.

 ఆజాద్ దిష్టి బొమ్మ దహనం...
ఉడీ ఘటనలో మృతి చెందిన సైనికులకంటే నోట్ల రద్దుతో చనిపోరుున ప్రజలే అధికంగా ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువమోర్చా నాయకులు శుక్రవారం ఇక్కడ పంజగుట్ట చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆజాద్ వ్యాఖ్యలు సైనికులను అవమానించేలా ఉన్నాయని, తక్షణమే జాతికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. 

>
మరిన్ని వార్తలు