సికింద్రాబాద్ స్టేషన్‌లో బాంబు కలకలం

18 Oct, 2016 16:27 IST|Sakshi
సికింద్రాబాద్ స్టేషన్‌లో బాంబు కలకలం

నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్‌లోని 2, 7 ప్లాట్‌ఫారాలలో బాంబులు పెట్టినట్లు ఆగంతకుడు 100కు ఫోన్‌ చేసి తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్‌, బాంబుస్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. అయితే అక్కడ బాంబులు ఏవీ లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

అయితే విస్తృత తనిఖీలు చేసిన తర్వాత అక్కడ బాంబులు ఏవీ లేవని తెలియడంతో కాస్త నెమ్మదించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌కు పాల్పడిన తర్వాత పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు ఎక్కడైనా దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని నిఘావర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ చిన్న వదంతి వచ్చినా కూడా ఒక్కసారిగా అంతా ఉలిక్కి పడుతున్నారు.

మరిన్ని వార్తలు