సిలిండర్ తగిలి బాలుడి మృత్యువాత

22 Jun, 2016 02:49 IST|Sakshi
సిలిండర్ తగిలి బాలుడి మృత్యువాత

- విధ్వంసం సృష్టించిన చిన్న గ్యాస్ సిలిండర్
- గాలిలో ఎగిరి బాలుడిని ఢీ కొట్టిన గ్యాస్ బండ
చిన్నారి మృతి.. అంబర్‌పేటలో ఘటన
 
 హైదరాబాద్: చిన్న గ్యాస్ సిలిండర్ పెను విధ్వంసానికి కారణమైంది. మంటలు ఎగజిమ్ముతూ గాలిలో ఎగిరి బీభత్సం సృష్టించింది. బంతిలా దూసుకెళ్లిన సిలిండర్ నాలుగేళ్ల బాలుడిని బలంగా తాకడంతో అతని కుడి చేయి తెగిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూశాడు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరివాడిలో ముంతాజ్ బేగం(55) చిన్న గదిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ముంతాజ్ కుమార్తె కమ్రాబేగం అకాశ్‌నగర్‌లో ఉంటోంది. కమ్రాబేగం మూడో కుమారుడు పర్వేజ్(4) అమ్మమ్మ ముంతాజ్ వద్దకు సోమవారం సాయంత్రం వచ్చాడు.

మంగళవారం ఉదయం 6.30 ప్రాంతంలో ముంతాజ్ టీ పెట్టుకోవడానికి ఇంట్లో ఉన్న ఐదు కిలోల చిన్న సిలిండర్‌ను వెలిగించింది. అయితే చిన్నగా గ్యాస్ లీకవుతున్నట్లు శబ్దం చే స్తూ మంట అంటుకుంది. దీంతో సిలిండర్‌ను ఇంటి బయటకు తీసుకొచ్చింది. మంటను అదుపు చేయడానికి సిలిండర్‌పై మట్టి పోసింది. మంటలు తగ్గకపోవడంతో బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చి మండుతున్న సిలిండర్‌పై పోసింది. నీళ్లు పోయగానే సిలిం డర్ పెద్దగా శ బ్దం చేస్తూ గాలిలో ఎగిరి ఇంటి ముం దున్న గోడలను, ఓ ఆటోను ఢీకొట్టింది. అదే వేగంతో వెనక్కి వచ్చిన సిలిండర్ ముంతాజ్ పక్కనే ఉన్న పర్వేజ్‌ను తాకింది. ఆ ధాటికి అతని కుడి చెయ్యి తెగిపడింది. ముంతాజ్ కాలునూ బలంగా తాకిన సిలిండర్ ఎగురుతూ వెళ్లి పక్కింటి ముందు ఆడుకుంటున్న షేక్ మహ్మద్ కుమారుడు షేక్ హజీ(18 నెలలు)కి తగిలింది. సిలెండర్లోని గ్యాస్ అయ్యేవరకూ అది బీభత్సం సృష్టిం చింది. పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే పర్వేజ్ మృతిచెందగా..  ముంతాజ్, షేక్ హజీ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని వార్తలు