విజిల్‌ బయటకొచ్చింది కానీ...

25 May, 2017 02:51 IST|Sakshi
విజిల్‌ బయటకొచ్చింది కానీ...

- బాలుడి గొంతులోనే విజిల్‌ లోపలి భాగం
- శస్త్రచికిత్స చేసి బయటకు తీసిన కోఠి ఈఎన్‌టీ వైద్యులు


హైదరాబాద్‌: ఆటలాడుతూ ఓ బాలుడు విజిల్‌ మింగాడు. హైదరాబాద్‌ కోఠి ఈఎన్‌టీ వైద్యులు బుధవారం శస్త్రచికిత్స చేసి ఆ బాలుడిని కాపాడారు. సిద్దిపేట జిల్లా సీతారామ్‌పల్లికి చెందిన బాబు కుమారుడు రిశ్వంత్‌(6) 15 రోజుల క్రితం ఆటాడుకుంటూ విజిల్‌ను మింగాడు. బాలుడు దగ్గుతుండడం.. శ్వాసకు ఇబ్బంది పడడం గమనించిన తల్లిదండ్రులు సిద్దిపేటలోని ప్రైౖవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్‌ చేసి గొంతులో విజిల్‌ ఉన్నట్లు గుర్తించారు. కోఠి ఈఎన్‌టీకి రిఫర్‌ చేయడంతో హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువచ్చారు.

అక్కడ రిశ్వంత్‌కు వాంతులు కావడంతో విజిల్‌ బయటకు వచ్చింది. దీంతో వైద్యులు ఇంటికి పంపివేశారు. రెండు రోజులుగా బాలుడు దగ్గుతుండడంతో బుధవారం మరలా కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి తీసుకొచ్చారు. హమీద్, రంగనాథ్, శ్వేతల ఈఎన్‌టీ వైద్య బృందం రిశ్వంత్‌కు శస్త్ర చికిత్స నిర్వహించారు. విజిల్‌లో ఉండే లోపల భాగం గొంతులోనే ఉండిపోవడంతో దానిని వెలికితీశారు. విజయవంతంగా చికిత్స పూర్తి చేసిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు